# Tags
#తెలంగాణ

చేనేత సమస్యలపై సి.ఎం సానుకూల స్పందన :చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళావిభాగం అధ్యక్షురాలు చిందం సునీత

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో చేనేత సమస్యలను తెలుపుతూ, ప్రభుత్వం  చేనేత పని వారికి తగిన సహాయ సహకారాలు, ప్రభుత్వ రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కి ఆదివారం హైదరాబాద్ లో కలిసి ఒక వినతి పత్రం అందజేయడం జరిగిందని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళావిభాగం అధ్యక్షురాలు చిందం సునీత ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ విజ్ఞప్తికి సానుకాలంగా స్పందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తనతో పాటుగా చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్, రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు కోమటిపల్లి సదానందం, కోశాధికారి చిలివేరి గణేష్, కుడిక్యాల భాస్కర్, మ్యాడం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి గూడ లావణ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పోచంసునీత పాల్గొన్నారని తెలిపారు.