# Tags
#తెలంగాణ

ఎనీమియా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా..

గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న తీరును పరిశీలించారు. ముందుగా పరీక్షల కోసం ఎందరు వచ్చారో ఆరా తీసి, వివరాలు నమోదు చేసిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పరీక్షలు చేస్తుండగా పరిశీలించారు. లింగన్నపేట పీ హెచ్ సీ లో ఎందరి పరీక్షలు చేశారో వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు.

108 మందికి ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేశామని కలెక్టర్ దృష్టికి పీ హెచ్ సీ వైద్యుడు వేణుగోపాల్ రెడ్డి
తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

గర్భంలో బాలింతలు మీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతినెల పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. రక్త శాతం తక్కువ ఉన్న వారు
మందులు, పండ్లు, డ్రైఫ్రూట్ తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం పీ హెచ్ సీ ఆవరణ, ల్యాబ్, మందులగది, ఇన్ పేషెంట్ గదులను, అలాగే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా పరిశీలించారు. ముగ్గురికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
పీ హెచ్ సీ ఆవరణను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించుకోవాలని వైద్యుడికి కలెక్టర్ సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో దవాఖానకు వస్తున్న అందరికీ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని వివరించారు‌. డెంగ్యూ నిర్ధారణ కిట్లు ఎన్ని ఉన్నాయో ఆరా తీశారు. ఏమైనా మందులు, నిర్ధారణ పరీక్షల కిట్లు అవసరం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక్కడ వైద్య సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఉన్నారు…అనంతరం సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారి మార్గం లోని లింగన్నపేట-గంభీరావుపేట మధ్యలో మానేరుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన వద్ద తాత్కాలిక రోడ్డు పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. వాహనదారులకు ఇబ్బంది కాకుండా రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గంభీరావుపేటలోని చెరువును పరిశీలించారు.

srinivas