#తెలంగాణ

పోత్గల్ పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ముస్తాబాద్, ఆగస్టు 21, 2024:


ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ, దవాఖానకు వచ్చే రోగులకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు.. వైద్యం ఇక్కడే అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ముస్తాబాద్ మండలం పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( పీహెచ్ సీ)ను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఫార్మసీ, వాక్సినేషన్ రూం, ఓపీ చెక్ చేసే గదిని, ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి, రోజు ఎంత మంది రోగులు హాస్పిటల్ కు వస్తున్నారో డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదము ఉందని, వైద్యులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల సీజనల్ జ్వరాలకు సంబంధించిన రక్తం పరీక్షలు ఇక్కడే చేయాలని, కావాల్సిన కిట్లు, పరికరాలు అందజేస్తామని తెలిపారు.

కుక్క, కోతి దాడులతో వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు గీతాంజలి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు గీతాంజలి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *