# Tags
#తెలంగాణ

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీర్నపల్లిలో పర్యటన

సిరిసిల్ల: (sampath panja)

వీర్నపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. వీర్నపల్లిలో సమస్యలను స్థానికులు ఇటీవల విన్నవించారు.

స్థానికుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం వీర్నపల్లి మండల కేంద్రానికి చేరుకొని, వాటిని పరిశీలించగా, స్థానికులు పలువురు కలెక్టర్ ను కలిసి సమస్యలపై విజ్ఞప్తి చేశారు.

పలువురు యువకులు తమ లైబ్రరీ కి పుస్తకాలు కావాలని కోరగా, అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ పర్యటన లో ఇంచార్జీ తహసీల్దార్ మారుతిరెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.