# Tags
#తెలంగాణ #Events #People

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః ||

మంథని :

స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి  ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు

విశ్వకళ్యాణ నిమిత్తము అమ్మాయవర్తినిసేవా ట్రస్టు మంథని వారి నిర్వహణలో, ఆలయ ధర్మకర్తలు మరియు మంథని గ్రామ వైదికుల సహాయముతో శ్రీ గాయత్రీ జపసహిత సంపూర్ణ ఋగ్వేదస్వాహాకార మహా యజ్ఞము నిర్వహించారు. 

ఆదివారం శంకరాచార్య మహాసంస్థానం
పుష్పగిరి పీఠాధీశ్వరులు
శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి శోభాయాత్ర జరిగింది.

ఉదయం 10 గం 30 ని.కు
స్వామివారి సమక్షంలో పూర్ణాహుతి నిర్వహించారు.

అనంతరం, స్వామి వారి అనుగ్రహ భాషణం, కలశోద్వాసన, అవభృత స్నానం ,పండిత సత్కారం, మహదాశీర్వచనం జరిగింది.
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి భారతీయుడు కృషిచేయాలని పుష్పగిరి పీఠాధీశ్వరులు
శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి ఈ సందర్బంగా ఉద్బోధించారు.
మనకు ధర్మం మాట్లాడాలంటే భయం.. భయానికి ప్రథమ కారణం మోహం.అంటే ఏమైనా మాట్లాడితే మనకున్నది ఏదైనా పోతాయేమో అని లోభంతో కూడిన మోహము.

మోహాన్ని వీడాలంటే వేదం ఒక్కటే సత్యo అన్న విషయాన్ని గుర్తించాలి. సత్యాన్ని మాట్లాడాలి,దీనికి మించిన యజ్ఞం మరొకటి లేదు, అందుకే మనం ఈరోజు నుండి సత్య వాక్పరిపాలకులం కావాలి. అలా సత్యంగా నీవు బ్రతకగలిగితే నీ జన్మ కి సార్థక్యం ఏర్పడుతుందని పుష్పగిరి పీఠాధీశ్వరులు
శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు హితవు పలికారు.