# Tags
#తెలంగాణ #జగిత్యాల

అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.

రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం సోమవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చేతులమీదుగా వాటర్ పూరీఫైయర్ ప్లాంట్ ను రోటరీ క్లబ్ – ఆపి ఆధ్వర్యంలో అందజేసింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ తోపాటుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ, అధ్యక్షులు చారీ, సెక్రటరీ ఎన్. రాజు, పూర్వ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, కొత్త ప్రతాప్, పి.సాగర్, సూర్యం, సభ్యులు సురేందర్ రావు, కాశీరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, పి ఆర్ టీ యూ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల ప్రాంత ప్రజలకు అవసరమైన రీతిలో అనేక సామాజిక కార్యక్రమాలను గత 4 దశాబ్దాలనుండి నిర్వహిస్తున్నామన్నారు.

స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సామాజిక కార్యక్రమాలపట్ల ఎన్ని విమర్శలు, ఎన్ని అభినందనలు వచ్చినా, అవేవీ పట్టించుకోకుండా, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, శాసన సభ్యుడిగా, రొటేరియన్ గా తమవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వివరించారు.

రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థ రోటరీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక్కా కార్యక్రమాల్లో ప్రధానంగా, పల్స్ పోలీస్ కార్యక్రమం అని వివరించారు.