👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం
👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు
హైదరాబాద్:
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు.
గ్లోబల్ ఫార్మా టెక్నాలజీ మెడిటెక్ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ AusBiotech విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్ లో జరగనున్న సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది.
“ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అర్జాతీయస్థాయిలో దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.

ప్రపంచంలో ఏడు అగ్రస్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ లో హైదరా బాద్ ఒకటిగా ఎదిగింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే అని గర్వంగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ప్రసంగించనున్నారు.
ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి శ్రీధర్ బాబు
ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించు కుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రభు త్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు
లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఏస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి “దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు” అరుదైన గౌరవం పొందడం పట్ల “తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్” ఆయన మిత్రబృందం “మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు” చెపుతుంది.
Telangana Reporter’s Best Wishes:
“Telangana Reporter Editor Siricilla Srinivas” and his team of friends congratulate Minister Sridhar Babu garu on receiving the rare honor of being given the opportunity to deliver the keynote address at the AS Biotech International Conference 2025, which is considered the most prestigious in the ‘Asia-Pacific’ region in the field of life sciences.
Minister Sridhar Babu gets a rare honor to speak from India at Melbourne conference.
State IT and Industries Minister Duddilla Sridhar Babu has received a rare honor. He has got the opportunity to deliver a keynote address at the ASBioTech International Conference 2025, which is considered the most prestigious in the ‘Asia-Pacific’
region in the field of life sciences. He is the only one who has got the opportunity to speak from India at the conference to be held in Melbourne from 21 to 24 of this month jointly organized by ASBioTech, the apex decision-making body of Australian life sciences, and the state government of Victoria. He will speak on the progress made by the Telangana life sciences sector in the past two days, future plans, opportunities and the favorable conditions for investing here. Australian Consul General Hilary McClochy specially invited Minister Sridhar Babu on Wednesday. She specially appreciated the efforts of Minister Sridhar Babu to make Telangana a global pharma technology meditech innovation hub under the guidance of CM Revanth Reddy. She specially appreciated the efforts of Minister Sridhar Babu to further strengthen the bilateral relations between Australia and Telangana. “This invitation is an international recognition of the progress made by Telangana in the field of life sciences. Hyderabad has become one of the top seven life sciences clusters in the world. We are the only Indian city to have made it to this list. We have brought new investments of Rs. 63 thousand crores in this field. We will use this platform more effectively to bring more. The government is working sincerely to strengthen the bilateral relations between Australia and Telangana,” said Minister Sridhar Babu.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





