# Tags
#జగిత్యాల #తెలంగాణ

పేదరికంలో ఉన్నప్పటికీ, చదువుపై శ్రధ్ద చూపిన విద్యార్థులకు అభినందనలు:రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం

పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం

జగిత్యాల :

-పేదరికంలో ఉన్నప్పటికీ, చదువుపై శ్రధ్ద చూపిన విద్యార్థులకు అభినందనలు:రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం

జగిత్యాలకు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం తన తల్లితండ్రులు  స్వర్గీయ దాసరి లక్ష్మీకాంతం, స్వర్గీయ దాసరి లలితమ్మ స్మృతిలో 2024 – సంవత్సరానికిగాను ఓల్డ్ హైస్కూల్ లో, పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన ముగ్గురు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.

రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం ఇదే ఓల్డ్ హైస్కూల్ లో, పదవ తరగతి వరకు చదువుకున్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత తాను చదివిన హైస్కూల్ లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తన తల్లితండ్రుల పేరిట నగదు పురస్కారంలను అందజేయడానికి సంకల్పించారు.

ఇందులో భాగంగా, పేదరికంలో ఉన్నప్పటికీ, చదువుపై శ్రధ్ద ఉంచి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు.ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి,   నగదు పురస్కారానికి ఎంపికైన విద్యార్థులు

* తెలుగు మీడియం విద్యార్థి  : బొమ్మిశెట్టి సాగర్

* ఇంగ్లీషు మీడియం విద్యార్థి : గోలి రంజిత్

* ఇంగ్లీషు మీడియం విద్యార్థిని : తెలుకుంట్ల వైష్ణవి లకు ప్రధానోపాద్యాయురాలు శ్రీమతి చంద్రకళ మరియు పాఠశాల యాజమాన్య బృందం ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్ హైస్కూల్) విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 5 వేల నగదు, ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికలను అందజేశారు.