# Tags
#తెలంగాణ

నూతన ఎస్సైకి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

చిగురుమామిడి, ఏప్రిల్ 8, 2025:

చిగురుమామిడి మండలం లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సంద బోయిన శ్రీనివాస్ ను మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎస్సై ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చిట్టుమల్ల శ్రీనివాస్, ఇందుర్తి మత్స్యశాఖ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గట్టు ప్రశాంత్, పూల లచ్చిరెడ్డి, పోటు మల్లారెడ్డి, దొడ్ల రమణారెడ్డి, పిట్టల శ్రీనివాస్, మరియు బొమ్మదేని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.