# Tags

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులకు విశేషమైన మద్దతు

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించడానికి రోజురోజుకు బ్యాంకు సభ్యుల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది.

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతూంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు స్వయంగా ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాటుపడటానికి గాను తన వంతు కృషిగావిస్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు పేరు వినని వారు లేరు. 

జగిత్యాల ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటుగా మార్క్ఫెడ్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చారు. 

అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని కుల మతాలకతీతంగా స్వర్గీయ వెలిచాల జగపతిరావు నాయకుడిగా, ప్రజల మనిషిగా ముందుండి రాజకీయాలను నడిపించారు. మరియు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఆవిర్భావంలో జగపతిరావు చేసిన కృషి ఆనాడు ఎంతో సత్ఫలితాలను అందించింది.

అదే ఒరవడితో ఆయన కుమారుడు వెలిచాల రాజేందర్ రావు తనదైన శైలిలో అన్ని వర్గాల వారితో మమేకమై, కరీంనగర్ కాంగ్రెస్ లో  డిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు పుష్కరకాలం తర్వాత జరుగుతున్న సందర్భంలో వెలిచాల రాజేందర్ రావ్ ప్రత్యేకంగా ఒక ప్యానల్ ఏర్పాటు చేసి తన తండ్రి బాటలో నడుస్తూ, తాను ప్రతిపాదించిన ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించి, బ్యాంకు అభివృద్ధికి పాటుపడతారని ఎలాంటి అవినీతికి తావివ్వకుండా కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా తమ ఫ్యానల్ నడిపిస్తుందని, డిపాజిటర్ల నమ్మకాలను వమ్ము చేయరని ప్రకటిస్తూ, కరీంనగర్, గంగాధర, జగిత్యాల ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ, తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని ముమ్మర ప్రచారం గావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో…కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంతో పాటు రోటరీ పార్క్, శ్రీ కాసుగంటి నారాయణరావు కళాశాల మైదానం, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లోని వాకర్స్ అసోసియేషన్ బృందాలను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచాల రాజేందర్ రావు ముమ్మర ప్రచారం గావించారు. 

జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో జగిత్యాల నుంచి గాదె కార్తీక్, కూసరి అనిల్ ను తమ ప్యానెల్ లో నియమించామని వివరించారు.

శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతు తమకి ఎంతో జగిత్యాల ప్రాంతంలో బలం చేకూరి తమ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించడంలో ముందుంటారని వారితో మాట్లాడుతూ, ధీమా వ్యక్తం చేశారు. 

ఆయా ప్రాంతాలోని వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహిస్తూ, జగిత్యాల కు చెందిన గాదె కార్తీక్ వేణుగోపాల్ మరియు కూసరి అనిల్ కుమార్ లతోపాటు తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు.