# Tags
#తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
ముట్టడించారు.

కమాన్ పూర్ మండలంలోని పెంచికల్పేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం పుట్ట మధు.. స్వర్గీయ శ్రీపాదరావుపై, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్ట మధు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.

అలాగే శ్రీపాదరావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ మాట్లాడుతూ పుట్ట మధుకు రాజకీయ బిక్ష పెట్టిన శ్రీపాదరావు పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

శ్రీపాద రావు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతినిధిగా ఆ పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఒక గొప్ప స్పీకర్ గా వారు పేర్కొన్నారు.

మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాదరావు ని మూడుసార్లు, శ్రీధర్ బాబు ని ఐదు సార్లు ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వారందరినీ సమానంగా చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం దళిత బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని తెలిపారు.

రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్న శ్రీపాద రావు విగ్రహాలు కూలుస్తామని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గతంలో కవిత ఎమ్మెల్యే టికెట్ ఇప్పిచ్చినప్పుడు వారిని తన సొంత అక్క అని అన్న మధు, బహిష్కరించిన తరువాత ఆమెపై విమర్శలు చేసి, కపట బుద్ధి ప్రజలందరికీ తెలిసిందని అన్నారు.

లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ కి విచారణలో భాగోతం బయటపడుతుందని భయంతో నోటికి వచ్చినట్టు మాట్లాడతున్నావని సిబిఐ త్వరలోనే విచారణ జరిపి నిన్ను కటకటాలకు పంపిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఇంకోసారి శ్రీపాద రావు పైన, శ్రీధర్ బాబు పైన, శ్రీను బాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.