# Tags

26వ డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఆంజన్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, 26వ డివిజన్లోని స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో ( మెడికల్ క్యాంప్ ) వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈవైద్యశిభిరాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ప్రారంభించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, మెడికల్ క్యాంపు నిర్వాహకులు UPHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలేఖ్య మరియు డాక్టర్లు భరత్ (ఆర్థో), డాక్టర్ రవి (జనరల్), డాక్టర్ మౌనిక (ఆప్తమాలజీ), డాక్టర్ మాధురి (పీడియాట్రిస్ట్), డాక్టర్ శ్రీలేఖ (గైనకాలజిస్ట్), డాక్టర్ శరత్ (డెంటల్) లు నిర్వహించిన వైద్య శిభిరంలో పేద ప్రజలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను రూపొందించిందన్నారు.

26వ డివిజన్ ను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరిగేలా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందని, వాటిని ప్రజలకు వివరిస్తూ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.

ఈ సమావేశంలో తిరుమలేష్, శ్రీధర్, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *