# Tags
#తెలంగాణ

క్రీడలతో ఒత్తిడి దూరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పోలీస్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్
సిరిసిల్ల:
ప్రశాంతమైన మంచి భద్రతతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ పాత్ర ఎనలేనిదని , ఇటువంటి పోలీసు శాఖకు క్రీడా పోటీల నిర్వహణ ద్వారా వారి ఒత్తిడి కొంత తగ్గుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
బుధవారం సిరిసిల్ల లోని అంబేడ్కర్ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండవ పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పాల్గొన్నారు.

క్రీడలతో ఒత్తిడి దూరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్