ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం
యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు
రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు
◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం : ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి
జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. పాస్‌పోర్టు, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా వంటి పత్రాల సేకరణను మండల తహసీల్దార్ ల ద్వారా వేగంగా పూర్తి చేయించి, దరఖాస్తుల పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో 19, ధర్మపురి నియోజకవర్గంలో 14, జగిత్యాల నియోజకవర్గంలో 7, వేములవాడ నియోజకవర్గంలో 6, చొప్పదండి నియోజకవర్గంలో 4 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు అయ్యింది. మొత్తం 50 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ. 2.5 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు.
అయితే, నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర సచివాలయంలోని జీఏడి ఎన్నారై విభాగం అధికారుల అలసత్వం కారణంగా గల్ఫ్ మృతుల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదని సమాచారం. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేయించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
నియోజకవర్గాల వారీగా గల్ఫ్ మృతుల వివరాలు:
కోరుట్ల నియోజకవర్గం (19):
1) మారంపెల్లి సుధీర్ (బహరేన్), వేంపేట, మెటుపల్లి; 2) కునింటి శ్యాం @మంగిలిపెల్లి శ్యాంసుందర్ (షార్జా, యూఏఈ), వర్ష కొండ, ఇబ్రహీంపట్నం; 3) అబ్దుల్ చాంద్ పాషా (సౌదీ), రవీంద్ర రోడ్, కోరుట్ల; 4) వడ్ల @మానాల అశోక్ (షార్జా, యూఏఈ), మల్లాపూర్; 5) కాపెల్లి రమేష్ (సౌదీ), రేగుంట, మెటుపల్లి; 6) గాజర్ల శ్రీనివాస్ (దుబాయి, యూఏఈ), ఐలాపూర్, కోరుట్ల; 7) పోగుల నరేష్ (బహరేన్), మల్లాపూర్; 8) మహ్మద్ అబ్దుల్ జావీద్ (రియాద్, సౌదీ), బిలాల్ పుర, కోరుట్ల; 9) సాదుల అశోక్ (రియాద్, సౌదీ), డబ్బ, ఇబ్రహీంపట్నం; 10) కర్నె గణేష్ (రియాద్, సౌదీ), రేగుంట, మల్లాపూర్; 11) ఖాజా మొహినుద్దీన్ (మదీనా, సౌదీ), గంగంపేట, కోరుట్ల; 12) రెబ్బతి కొండయ్య (సౌదీ), చిట్టాపూర్, మల్లాపూర్; 13) బొల్లోజి కిషన్ (ఓమాన్), రాతల్ పంపు, కోరుట్ల; 14) మాటేరి కిషన్ (దుబాయి, యూఏఈ), రాజేశ్వర్ రావుపేట, మెటుపల్లి; 15) షేఖ్ హైదర్ (అబుదాబి, యూఏఈ), వర్షాకొండ, ఇబ్రహీంపట్నం; 16) మహ్మద్ వసీం (సౌదీ), గాజులపేట, మెటుపల్లి; 17) లకావత్ రమేష్ (షార్జా, యూఏఈ), వాల్గొండ, మల్లాపూర్; 18) బత్తిని రమేష్ (బహరేన్), యూసుఫ్ నగర్, కోరుట్ల; 19) షేఖ్ అహ్మద్ (సౌదీ), నయీమ్ నగర్, కోరుట్ల.
ధర్మపురి నియోజకవర్గం (14):
1) మిట్ట రాజయ్య (షార్జా, యూఏఈ), గంగాపూర్, బుగ్గారం; 2) సల్లూరి రాజేశం (బహరేన్), తీగల ధర్మారం, ధర్మపురి; 3) కటుకం సిద్ధార్థ (దుబాయి, యూఏఈ), ధర్మపురి; 4) కొప్పుల సంజీవ్ (దుబాయి, యూఏఈ), వెనుగుమట్ల, గొల్లపల్లి; 5) స్వర్గం శ్రీనివాస్ (దుబాయి, యూఏఈ), దమ్మన్నపేట, ధర్మపురి; 6) బూట్ల రాజేందర్ (సౌదీ), కొత్తపేట, ఎండపల్లి; 7) సాంబారి స్వామి (దుబాయి, యూఏఈ), బొంకూర్, గొల్లపల్లి; 8) కలమడుగు కొమురయ్య (సౌదీ), చిన్నాపూర్, ధర్మపురి; 9) కొమురెల్లి నరేష్ (సౌదీ), బోయవాడ, ధర్మపురి; 10) ఎనుగందుల కిష్టయ్య (ఖతార్), కొండాపూర్, ఎండపల్లి; 11) ఎర్రం రాజ్ కుమార్ (దుబాయి, యూఏఈ), బూరుగుపల్లి, ధర్మపురి; 12) బేతు ప్రసాద్ (మస్కట్, ఓమాన్), దొంతాపూర్, ధర్మపురి; 13) లింగంపెల్లి రమేష్ (ఇరాక్), పెగడాపల్లి; 14) గుర్రం సురేష్ (ఇరాక్), నేరెళ్ల, ధర్మపురి.
జగిత్యాల నియోజకవర్గం (7):
1) నీలి తిరుపతి (దుబాయి, యూఏఈ), శంఖులపల్లి, జగిత్యాల; 2) మహ్మద్ ముఖ్తార్ మొహియుద్దీన్ (దుబాయి, యూఏఈ), సుతారిపేట, జగిత్యాల; 3) దాసరి రమేష్ (దుబాయి, యూఏఈ), అల్లీపూర్, రాయికల్; 4) అనుమాండ్ల రాజేశం (దుబాయి, యూఏఈ), పెంబట్ల, సారంగాపూర్; 5) బోగ మనోహర్ (జుబేల్, సౌదీ), క్రిష్ణానగర్, జగిత్యాల; 6) సుతారి @తోట ధర్మయ్య (సౌదీ), రాయికల్; 7) అనుమల్ల కళ్యాణ్ (సౌదీ), టాకా వీధి, జగిత్యాల.
వేములవాడ నియోజకవర్గం (6):
1) చేర్ గంగారాం (షార్జా, యూఏఈ), దమ్మన్నపేట, మేడిపల్లి; 2) గడ్డం నర్సారెడ్డి (సౌదీ), తొంబరావుపేట, మేడిపల్లి; 3) గుంట హనుమంతు (సౌదీ), పోసానిపేట, కథలాపూర్; 4) సంగెం వినోద్ (సౌదీ), భూషణ్ రావు పేట, కథలాపూర్; 5) సంగ మల్లయ్య (సౌదీ), తక్కళ్లపల్లి, కథలాపూర్; 6) చెక్కపెల్లి గంగాధర్ (దుబాయి, యూఏఈ), భీమారం.
చొప్పదండి నియోజకవర్గం (4):
1) ఆకునూరి నర్సయ్య (ఓమాన్), నాచుపల్లి, కొడిమ్యాల; 2) పంజాల వాసు గౌడ్ @శ్రీనివాస్ (దుబాయి, యూఏఈ), ముత్యంపేట, మల్యాల; 3) బోగ గంగసాయి (దుబాయి, యూఏఈ), మల్యాల; 4) బూస అంజయ్య (యూఏఈ), ముత్యంపేట, మల్యాల.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





