# Tags

చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ )

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాముల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఉపయోగకరమన్నారు.ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు పెరుగుతుందని భూమి కూడా కోతకు గురికాకుండా ఆపడం జరుగుతుందన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా ఎంతోమంది జీవితాలలో జీవనోపాధిలాగా మారిందన్నారు.

జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల పొలాలలో భూమిని చదును చేయడం గుట్టలకు కాంటూరు కందకాలను తవ్వడం చెరువుల్లో మట్టిని తీయడం ఎంతో ఉపయోగకరమన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరాబేగం వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి ఎంపీడీవో సత్తయ్య ఏపీఓ కొమురయ్య ఈసీ రాజు. టి ఏ లు నవత నాగరాజు గ్రామపంచాయతీ కార్యదర్శి జాఫర్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,గంట బుచ్చగౌడ్, మెండ శ్రీనివాస్ ,బండారు బాల్ రెడ్డి,గొల్లపల్లి మల్లేశం, నిమ్మ సుధాకర్ రెడ్డి, సిరిపురం మహేందర్ ,నిమ్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు..