# Tags
#తెలంగాణ #జగిత్యాల

గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించినజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల జిల్లా :

సోమవారం ఉదయం అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని తెలిపారు.

24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల్ ఆర్డిఓ మధుసూదన్, మరియు డిఎస్పి రఘుచందర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య టెంపుల్ ఏవో, ఎమ్మార్వో, ఎంపీడీవో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.