# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : (S. Shyamsunder)

బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  జిల్లాలోని పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు.

రాయికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల బాలుర, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేడిపల్లి జిల్లా ఉన్నత పాఠశాల  పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్  కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

పోలింగ్ స్టేషన్ల వద్ద BNNS యాక్ట్ (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా సరే ఎన్నికల నియమవాళిని తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరుగుతున్నందున, పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకువాలన్నారు.