# Tags

తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :సంపత్ పంజా :

ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలను గతంలో తనిఖీ చేయగా విద్యార్థులకు తరగతి గదులు ఇబ్బందిగా ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రెండు తరగతి గదుల నిర్మాణాలను చేయాలని ఆదేశించారు.

వాటి నిర్మాణంతో పాటు విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కోసం వేసిన బోరు మోటారును పరిశీలించారు పూర్తిస్థాయిలో తరగతి గదుల నిర్మాణం అయిపోవాలని ఆదేశించడం జరిగింది.

కలెక్టర్ వెంట మండల తాసిల్దార్ సుజాత ఎంపీడీవో సత్తయ్య ఎంపీఓ రాజు. పి ఆర్ డి ఈ శ్రీనివాస్. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ నాయకులు సూడిద రాజేందర్ శ్రీనివాస్ ఉన్నారు అనంతరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను రాచర్ల గుండారంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.