# Tags

ఇందిరా మహిళా శక్తి యూనిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్

ఇందిరా మహిళా శక్తి యూనిట్లను బ్యూటీ పార్లర్, మాచింగ్ సెంటర్,పిండి గిర్నీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్

చిగురుమామిడి : (ముడికే కనకయ్య):
మండల కేంద్రంలోని ఇందుర్తి గ్రామంలో
ఇందిరా మహిళా శక్తి లబ్దిదారులు బ్యాంక్ లింకేజీ ఋణం ద్వారా యూనిట్ ఏర్పాటు చేసిన అంబటి శైలజ బ్యూటీ పార్లర్ 2లక్షల రూపాయలు,కోడూరి రాజమణి పిండిగిర్ని 2లక్షల రూపాయలు,పున్నం మౌనిక పిండిగిర్ని 2లక్షల రూపాయల యూనిట్ లబ్ధిదారులతో మాట్లాడారు.
వారి యొక్క ఆదాయం గురించి అడిగి ఒక్కొక్కరికి వరుసగా నలబై వేలు,పదిహేను వేలు,పదిహేను వేలు వస్తున్నట్లు తెలుసుకొని యూనిట్లను నడుపుతున్న సభ్యులను అభినందించారు

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వుప్పుల శ్రీధర్ ఎంపీడీవో ఎండి ఖాజా మొయినోద్దిన్ డిపిఎం,సిహెచ్ ప్రవీణ్ కుమార్, ఎంపీ ఓ బండ రాజశేఖర్ రెడ్డి ఆర్ ఐI అరుణ్ కుమార్ ఏపీఎం మట్టేల సంపత్, సీసీ దుబ్బాక వెంకటేశ్వర్లు,వివో అధ్యక్షురాలు బందేల మల్లవ్వ, వివో ఏ లు బుర్ర శోభ,కత్తి రమాదేవి,గాలిపెళ్లి లక్ష్మీ,మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు