# Tags
#తెలంగాణ

మానేరు జలాలకు పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

కుడి కాలువకు నీటి విడుదల.….


గంభీరావుపేట,

గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండడంతో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి మానేరు జలాలకు పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు.

ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 2 టీ.ఎం.సీ.లు కాగా, పూర్తిగా నిండింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ను కలెక్టర్, ఎస్పీ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ తో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.

అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తదితర వివరాలను నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ లోకి ఎగువ నుంచి 9500 క్యూసెక్కుల నీరు వస్తుందని, అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ…. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి మట్టాన్నీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని వదలాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్, డీఈ నర్సింగం, డి.వి.హెచ్.ఓ. రవీందర్ రెడ్డి, తహసిల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.