# Tags
#తెలంగాణ

దీపావళి వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కార్యాలయ సిబ్బంది, వృద్ధులతో టపాకాయలు కాల్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
(తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
క్యాంప్ కార్యాలయ సిబ్బంది, మండెపల్లిలోని వృద్ధాశ్రమంలో గురువారం దీపావళి వేడుకల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన క్యాంప్ కార్యాలయ సిబ్బందితో టపాకాయలు కాల్చి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులతో దీపావళి వేడుకలు చేసుకున్నారు. వారికి స్వీట్లు పంచి పెట్టారు. కలెక్టర్ తమ ఆశ్రమానికి వచ్చి వేడుకల్లో పాల్గొనడంతో వృద్దులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.