# Tags
#తెలంగాణ

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

•విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

జగిత్యాల :

విధి నిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు ఎంపికైన పోలీస్‌ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. 

జగిత్యాల డి ఎస్ పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సారంగాపూర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాములు సేవా పతకం కు ఎంపికయ్యారు. 

ఆయనతోపాటుగా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ రాజు, సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మొయినుద్దీన్,  డిస్టిక్ ఆర్మ్ రిజర్వుడ్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నసీముద్దీన్ ,  డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ లో   విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య,  రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ తకీయుద్దీన్, రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోచయ్య,  రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోహన్ లాల్ లు సేవా పతకం కు ఎంపికయ్యారు. ఈ సందర్భంలో సేవా పతకం పొందిన పోలీస్ఎ లను ఎస్ పి అశోక్ కుమార్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.