# Tags
#తెలంగాణ

ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి ఎం హెచ్ ఓ సమీక్ష సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ కుమార్ పంజ):-
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏం. వసంతరావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏం వసంతరావు, డాక్టర్ రాజగోపాల్, సిబ్బందికి, ఆశల తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లపై దిశా నిర్దేశం చేసినారు.

నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లెల్ల ఆరోగ్యం ఉపకేంద్రము ఆకస్మిక తనిఖీ చేసినారు. పోతుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి మరియు ఆశలతో నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ పై సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ఆరోగ్య కార్యక్రమాలలో జిల్లాను ముందు ఉంచాలని సూచించినారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.