# Tags
#తెలంగాణ

మాకు న్యాయం చేయండి బుడగ జంగాల ఆవేదన…

రాజన్న సిరిసిల్ల జిల్లా :

ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న బుడగ జంగాల వర్గంప్రజలు తమకు అధికారులు అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామానికి అనేక సేవలు అందిస్తున్నామని తమకు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోపాటుగా ఓటు హక్కు కూడా పోతిరెడ్డిపల్లిలోనే ఉందని బుడగజంగాలు తెలిపారు.

ప్రస్తుతం ఉంటున్న మా గుడిసెలను ఖాళీ చేయించి అడవిలోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ,గ్రామ సభ్యులు కలిసి అటవీ లో ఉన్న ఒక ప్రాంతాన్ని చూపెట్టినారు.మేము అక్కడ గుడిసెలు వేసుకుంటే శుక్రవారం ఉదయం సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి గుడిసెలను తొలగించడం పట్ల కన్నీరు మున్నిరయ్యారు.

తాము క్రింది స్థాయి జాతికి చెందిన వారమని, ఇష్టారితిన మాట్లాడుతన్నారు అని తెలిపారు.

మేము వీధిన పడ్డామని, రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మండల తహసీల్దార్ ను కోరారు.

ప్రస్తుతం నివసిస్తున్న స్థలము నుండి గెంటివేస్తూ డంపు యాడు సమీపంలో గల భూమిని ఇందులోనే ఉండమని బెదిరించారని పత్రికా ముఖంగా తెలిపారు.

మా గ్రామానికి పనిచేసే మీరు మమ్మల్ని ఎదిరిస్తున్నారా మేము చెప్పిన వద్దనే ఉండాలి అంటూ కొందరు గ్రామస్తులు వేధిస్తున్నారని తెలిపారు.

దీనిపై పాత్రికేయులు తహసీల్దార్ సుజాతను వివరణ కోరగా జిపిఓ ను సంఘటన స్థలానికి పంపి సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు.