# Tags
#తెలంగాణ

పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

( తెలంగాణ రిపోర్టర్)

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు.

ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి రాజ మనోహర్, బిసి నాయకులు, గొల్ల, కురుమ సంఘాల నాయకులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.