# Tags
#తెలంగాణ

IDBI బ్యాంక్ ఆధ్వర్యంలో హై స్కూల్ కు USHA R.O వాటర్ ప్యూరిఫైయర్ అందజేత 

జగిత్యాల:

IDBI బ్యాంక్, జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం చలిగల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో CSR సీడ్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.Hyd-II రీజనల్ హెడ్ డి వెంకటేష్ సూచనల మేరకు శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా IDBI బ్యాంక్ USHA వాటర్ కూలింగ్ సిస్టమ్ (80lts సామర్థ్యం)తో RO వాటర్ ప్యూరిఫైయర్ (40lts/hr కెపాసిటీ)ని పాఠశాలకు అందించింది.

Hyd-II రీజినల్ కో-ఆర్డినేటర్ & AGM నరేన్ కందాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో IDBI బ్యాంక్ జగిత్యాల బ్రాంచ్ హెడ్ పి అజిత్ కుమార్, Asst.Mngr ఎం ప్రవీణ్ కుమార్, ZPHS HM శ్రీమతి లతాదేవి మరియు ఇతర పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఉన్నారు.

ఈ సందర్బంగా Hyd-II రీజినల్ కో-ఆర్డినేటర్ & AGM నరేన్ కందాల మాట్లాడుతూ, విద్యా సంస్థలను ముఖ్యంగా ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలకు సాధికారత కల్పించడంలో మరియు ఇలాంటి ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా యువ విద్యార్థుల అభివృద్ధిని ప్రోత్సహించడం IDBI బ్యాంకుల ప్రధాన లక్ష్యమన్నారు.తమ బ్యాంకు ప్రతిష్టను పెంచడం మరియు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.