# Tags
#తెలంగాణ

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన దాతలు

హుజురాబాద్ : M. కనకయ్య

హుజురాబాద్ నివాసులు, పట్టణ కేంద్రంలోని శిశుమందిర్ దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డి ల రెండవ కుమారుడు ప్రతాపు నాగరాజు వయసు 40 సంవత్సరాలు.

జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో గత శుక్రవారం రోజున మరణించాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు 11 రోజుల కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో ఉన్న రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ఎస్పి మునుగంటి రవీందర్ కొంత ఆర్ధిక సాయం తో పాటుగా నగదు మరియు గంగిశెట్టి జగదీశ్వర్ 25 కిలోల రైస్ బ్యాగు అందించారు.

గతంలో వీరి కోడలు క్యాన్సర్ తో మరణించగా రవీందర్ మరియు జగదీశ్వర్ పదివేల రూపాయలు నగదు సహాయం చేసినారు. దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *