#తెలంగాణ

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ఆధ్వర్యంలో డా. బిఆర్ అంబేద్కర్ స్మరణ

జగిత్యాల :

దేశానికి డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్షాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవటం ఈ కార్యక్రమం లక్ష్యం.

డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ తన జీవితంలో చేసిన త్యాగాలు, రచనలపై సంక్షిప్త సందేశం ఇవ్వటం, వారి వారసత్వ గౌరవ వందనంగా ఒక్క నిమిషం మౌనం పాటించే కార్యాచరణతో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్
ఆధ్వర్యంలో జగిత్యాల శాఖ కార్యవర్గ సభ్యులు,
కార్యక్రమ నిర్వాహకులు నల్ల శ్యామ్ నిర్వహణలో
ఆదివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీసభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

బాబాసాహెబ్ అని కూడా పిలువబడే డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, ప్రఖ్యాత భారతీయ న్యాయవేత్త, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించడం మరియు దేశానికి మొట్టమొదటి న్యాయ మరియు న్యాయ మంత్రిగా పనిచేసినందుకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో DICCI కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ తో పాటుగా
TPCC కార్యదర్శి బండ శంకర్, మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, సీనియర్ అంబేద్కర్ వాది కొప్పుల వెంకటరమణ,సీనియర్ అంబేద్కర్ వాది కంటే అంజయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ ఉపాధ్యక్షులు బిరుదుల లక్ష్మణ్,అంబేద్కరిస్ట్ కాయితీ శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, సీనియర్ అంబేద్కర్ వాది దాసరి లక్ష్మణ్, పల్లె రవి, బొల్లం రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *