# Tags
#తెలంగాణ

మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ అవార్డునందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ :
మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు మరియు అవార్డులను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ మాజీ స్పీకర్ S. మధుసూధనా చారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్ కుమారి డా. సాజిదా ఖాన్, ప్రముఖ జానపద గాయకుడు ప్రణయ్ కుమార్ తో పాటుగా వరుణ్ యలమంచిలి మరియు దినేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ మాజీ స్పీకర్ S. మధుసూధనా చారి బాలల దినోత్సవ వేడుకల అవార్డును రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్ కుమారి డా. సాజిదా ఖాన్ కు అందించి అభినందించారు. ఈ సందర్భంలో ఆమె మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.