#జగిత్యాల

కరాటే బెల్ట్ లు, సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

జగిత్యాల జిల్లా:

మల్యాల x రోడ్:

కరాటేతో ఆత్మ విశ్వాసం ఆత్మ స్థైర్యం పెంపొందుతాయి: కరాటే బెల్ట్ లు & సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

జగిత్యాల జిల్లా మల్యాల x రోడ్ లోని ఆల్ఫోర్స్ ( NSV ) స్కూల్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఈ విద్యా సంవత్సరం కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థిని, విద్యార్థులకు కలర్ బెల్ట్ అప్ గ్రేడింగ్ టెస్ట్ మరియు సర్టిఫికెట్స్ ల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… కరాటే అనేది అతి ప్రాచీనమైన యుద్ధ విద్య అని..అన్ని యుద్ధ విద్యలకు కరాటే మాతృ కళ అని అన్నారు.అలాగే కరాటే నేర్చుకొని అందులో సాధించే SGFI సర్టిఫికెట్స్ ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్య మరియు ఉన్నతమైన ఉద్యోగాలు స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటాలో సాధించడానికి అవకాశం ఉంటుందని విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు.

అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు కరాటే లోని మెలకువలు వాటిని సాధించే ప్రక్రియలలో క్రమశిక్షణ అలాగే సమాజంలో జరిగే విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.

మల్యాల ఆల్ఫోర్స్ బ్రాంచ్ కి చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొనటమే కాకుండా పథకాలు సాధించటం అభినందనీయం అని అన్నారు.అలాగే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.

ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్ గా తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ చైర్మన్ ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె వసంత్ కుమార్ హాజరై పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాటవాలను పరీక్షించి అందులో ఉత్తమ ప్రతిభాపాటవాలు, అత్యంత నైపుణ్యం కనబర్చిన పిల్లలకి బెల్టులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్,ఉపాధ్యాయని ఉపాధ్యాయులు,కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు & కోచ్ మర్రిపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *