# Tags
#తెలంగాణ

డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్ ):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గల సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనవరి 1,2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామని, వేములవాడ నియోజకవర్గం లో మొత్తం 2,27,575 మంది ఓటర్లు, సిరిసిల్ల నియోజకవర్గం లో 2, 47,489 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

మన జిల్లాలో మొత్తం 2,28,745 మంది పురుషులు, 2,46,114 మంది స్త్రీలు, 37 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారని, మరో 161 పురుషులు, 7 మహిళలు సర్వీస్ ఓటర్లుగా ఉన్నారని తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన ప్రజలు తమ పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో చెక్ చేసుకోవాలని, లేని పక్షంలో నవంబర్ 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 9,10 తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రత్యేక క్యాంపులను సైతం ఏర్పాటు చేస్తామని, వీటిని వినియోగించుకుని అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.