# Tags
#తెలంగాణ #People #జగిత్యాల

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం


తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ (రెడ్కో) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవిలో ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి లో పీఎం-సూర్యఘర్, పీఎం-కుసుమ్, ఈవీ- ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, తదితర ప్రభుత్వ పథకాల అమలు, సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో రైతుల ప్రైవేట్ సోలార్ ప్రాజెక్టుల స్థాపన, ప్రభుత్వ భవనాలపై సోలార్ పలకల ఏర్పాటు వంటి నిర్దేశించిన లక్ష్యాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేగవంతంగా సాధించడంలో మనోహర్ సఫలం అవుతారని భావిస్తున్నారు.

ఈ నియామకానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెడ్కో చైర్మన్ డా.శరత్, ఎండీ అనిల తదితరులకు మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, హరిత ఇంధన ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వారికి కలిగే లాభాల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పించి సమన్వయం చేస్తానని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు.

శుభాకాంక్షలు :

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా మిత్రులు దురిశెట్టి మనోహర్ గారు నియామకం అయిన సందర్భంలో “తెలంగాణ రిపోర్టర్” ఎడిటర్ సిరిసిల్లశ్రీనివాస్ శుభాకాంక్షలు.