# Tags
#తెలంగాణ

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి…

(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా…(sampath panja)

వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అధికారులు,సిబ్బందికి అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు.నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని,విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం విపివో ల దగ్గర ఉండాలని ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు.బ్లూ కోల్ట్ సిబ్బంది డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని, రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై ,అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శివకుమార్ సిబ్బంది ఉన్నారు.