# Tags

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు

కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసితభారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమమును దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగిత్యాల జిల్లాను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు . ఈ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలను చేర్చారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో 18 నుండి 25 సంవత్సరముల లోపు గల విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

ఈనెల 9వ తేదీ లోపు మూడు జిల్లాలకు చెందిన 100 మందికి పైగా తమ పేర్లు మై భారత్ పోర్టల్ లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు. ఒక నిమిషం నిడివి గల వీడియోను రికార్డ్ చేసి మై భారత్ పోర్టల్ లో అప్లోడ్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాలలో గురు, శుక్రవారంలలో రెండు రోజులపాటు నిర్వహించిన వక్తృత్వ పోటీలలో మొదటి రోజు గురువారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. ఏ.అశోక్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంను

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బీ ఎస్. లత ప్రారంభించారు. కార్యక్రమం కో ఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆడెపు శ్రీనివాస్, ఎన్ సి సి అధికారి లెఫ్ట్నేనెంట్ రాజు, సాయి మధుకర్ ,  గోవర్ధన్, శ్రీనివాస్, సురేందర్ మరియు అధ్యాపక బృందం సమన్వయంతో నిర్వహించిన ” వన్ నేషన్ వన్ ఎలక్షన్ ” అనే అంశంపై యువతకు నిర్వహించిన వక్తృత్వ పోటీలకు జ్యురీ సభ్యులు గా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బీ ఎస్.లత  తో పాటుగా, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, తదితరులు వ్యవహరించారు. మొదటిరోజు జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు, యువత 70 మందికి పైగా పాల్గొన్నారు. 

అలాగే, రెండవరోజు శుక్రవారం రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొనగా, ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్ట్ బార్ కౌన్సిల్ సభ్యులు కళాశాల భూదాత కుటుంబ సభ్యులు, పలు సామాజిక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాసుగంటి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.

యువత, విద్యార్థులు విద్యతో పాటుగా వినయం, సంస్కారం అలవర్చుకోవాలన్నారు. దేశ భవిష్యత్తులో యువతదే ప్రధాన పాత్ర అన్నారు.

అలాగే ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులతోపాటు సిరిసిల్ల మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్ శ్రీమతి శకుంతల తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ… వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 లో భాగస్వాములం కావడం తమ అదృష్టమన్నారు. “వన్ నేషన్ వన్ ఎలక్షన్ ” తో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎంతో బాగుంటుందనీ, ప్రతీ ఓటర్ ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తలపెట్టిన వికసిత భారత్ సత్ఫలితాలనిస్తుందన్నారు.ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయన్నారు.

ఇదిలా ఉండగా, రెండురోజులపాటు నోడల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో స్క్రీనింగ్ చేసి పదిమందిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి అసెంబ్లీ హాల్లోకి  పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు జాతీయస్థాయిలో పార్లమెంట్ హాల్లో ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమమును నిర్వహించుటకు ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ను నిర్వహణ కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల అలుమ్ని ప్రతినిధులు సిరిసిల్ల శ్రీనివాస్, సుధాకర్ లు నెహ్రు యువకేంద్ర కు, కేంద్రప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు.

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు