# Tags
#తెలంగాణ #జగిత్యాల

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు…

రాయికల్ : S. Shyamsunder

భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు.

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగడానికి అలాగే పరీక్షలు ఎలా సన్నద్ధమవ్వాలో పలు సూచనలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వేణుగోపాల్ పరీక్ష ప్యాడ్ లతో సహా పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమ్మెంతల వెంకటరమణి, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఆప్క్ చైర్మన్ లావణ్య, మాజీ చైర్మన్ జక్కుల ప్రసాద్, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య,

శంకరయ్య, మహేష్, వంశీధర్ రావు, సురేష్, వేణు, సంజీవ్, హుస్సేన్, కమురుద్దీన్ పుష్పలత, భవాని, సరోజినీ, శైలజ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.