# Tags

ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ :

  • ఎకరా 20 వేలు నష్టపరిహారం అందించాలి
  • బడ్జెట్ సమావేశంలో పంట నష్టం,రైతు భరోసా పై నిర్ణయం తీసుకోవాలి
  • ఫిబ్రవరి చివర్లో రైతు భరోసా అందించాలి :
    మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆరుకాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే దశలో పకృతి వైపరీత్యంతో అకాల వర్షం,ఈదురు కాలులతో పంట నష్టపోయిన మొక్కజొన్న,మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

సోమవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షంతో నేలకొరిగిన మొక్కజొన్న, మామిడి పంటలను రాయికల్ మండలంలోని రామజిపేట్ గ్రామంలో మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు.

కలెక్టర్,వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు.

అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంట నష్ట బీమా పథకం అమలులో లేనందున పకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేలు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ అంశం మాత్రమేనని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు కలిగే రైతు భరోసా నిధులు ఈనెల ఫిబ్రవరి చివర్లో విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి రైతుల పక్షాణ దృష్టి సాధించి దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,నాయకులు తంగేళ్ల రమేష్,ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్,దాసరి గంగాధర్,కడకుంట్ల నరేష్,మున్ను,ఎద్దండి లింగారెడ్డి,బాపురపు నర్సయ్య,కొమ్ముల ఆదిరెడ్డి, బత్తిని భూమయ్య,షాకీర్,మండ రమేష్, నాగరాజు,రాజీవ్,శివ,రాజారెడ్డి,హరీష్,సుదీర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *