# Tags
#తెలంగాణ

పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్

ఢిల్లీ :

నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఇవాళ పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్‌ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. పెరుగు, చెక్కరతో నోరు తీపి చేసి గుడ్‌లక్‌ చెప్పారు

ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్లో లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26…ఎనిమిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సీతారామన్‌.

బిహార్‌లో మకానా బోర్డు ఏర్పాటు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు.

రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

పోస్టల్‌ రంగానికి కొత్త జవసత్వాలు.

MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత.

ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన ప్రకటించిన నిర్మల.

ధన్‌ధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి.

దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం.

గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన.

పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం.

కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం.

పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం.