#తెలంగాణ

ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా


జగిత్యాల

ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

బుధవారం రోజున IDOC లోని కాన్ఫరెన్స్ హాలులో సహాయ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఈవీఎం, వివి ప్యాట్ ల మొదటి ర్యాడమైజేషన్ నిర్వహించారు.

రానున్న లోకసభ ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రానిక్ యంత్రాలు, వివిప్యాట్ లను జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. కోరుట్ల నియోజక వర్గానికి 327 బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, జగిత్యాలకు 317, ధర్మపురి కి 336యూనిట్లనుకకేటాయించామని వివరించారు.

, అదేవిధంగా కోరుట్ల కి 366 వివి ప్యాట్ లను, జగిత్యాలకు 355, ధర్మపురికి 376 కేటాయించడం జరిగిందని తెలిపారు. త్వరలో ఆయా నియోజక వర్గాలకు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పూర్తి వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతులను అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దివాకర, పి.రాంబాబు, ఆర్డీఓ లు మధుసూదన్, ఆనంద్ కుమార్, సంబంధిత తహశీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *