# Tags
#తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

( తెలంగాణ రిపోర్టర్)

జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని,అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు.పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని,ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసులను దర్యాప్తు చేయాలన్నారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి,పేకాట,పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు,అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని,ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

సైబర్ కేసులపై దృష్టి సారించి సాంకేతికత వినియోగించుకొని కేసులను చేధించాలని ఆదేశించారు.అదేవిధంగా గ్రామాలలో, పట్టణలలో ప్రజలకు, యువత సైబర్ నెరలపై, బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ వాళ్ళ కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో వేములవాడ ఏఏస్పి శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,మధుకర్, నాగేశ్వరావుఎస్.ఐ లు,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.