# Tags

4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి స్వతహాగా కంటి వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు.

ఈ సందర్బంగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేషన్లు చేసూకున్న వారికి తీసుకోవలసిన కంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.

https://public.app/video/sp_gzxuawtu0zen4?utm_medium=android&utm_source=share

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ…మానవ సేవను మాధవ సేవ గా భావిస్తాననీ,  ఆ ధ్యేయంగానే సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవలో అందరి అభిమానంతో ముందుకు వెళ్తున్నానన్నారు.అందులో భాగంగానే,  రోటరీ క్లబ్ , ఆపి స్వచ్ఛంద సంస్థల ద్వారా గత 40ఏండ్లుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.

కాగా, శాసనసభ్యుడిగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ కోసం మైక్రో ఆపరేషన్ మిషన్ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.కంటి వైద్యులు కూడా ఉన్నారనీ, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవాలన్నారు ..రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ, 
రాయికల్ , జగిత్యాల లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అని వివరించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ ,రోటరీ క్లబ్ సభ్యులు చారి, కొత్త ప్రతాప్, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, డా.వెంకటేశ్వర్ ,డా.ధీరజ్, డా.విజయ్, కరవత్తుల భూమన్న, ఎన్నాకులఅశోక్, మాజీ వైస్ ఎంపీపీ సురేందర్,కోలగని సత్యం,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్,పాలొజి సత్యం,శేఖర్,ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.