తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాలలో 21 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన
ఓం నమో వెంకటేశాయ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో…వేముల ఉమారాణి నిర్వహణలో, వేద పండితులు, జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు నంబి వేణుగోపాలచార్య మంగళాశాసనములతో…తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 21 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభమయ్యింది.

స్వామివారి ప్రదర్శనను వేదోక్తంగా నంబి వేణుగోపాలచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ తో పాటుగా పలువురు పట్టణ ప్రజలు పాల్గొని, తిలకించారు
వచ్చే నెల 5 వరకు నెలరోజుల పాటు కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 21 అడుగుల 3డీ సైకత శిల్ప ప్రదర్శనను కరీంనగర్ రోడ్ లోని, జగిత్యాల, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు.
ఉదయం 9 గంటల నుండి 10-30 గంటల వరకు నిర్వహిస్తున్న స్వామివారి ప్రదర్శనను తిలకించి, స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నామని కార్యక్రమం నిర్వాహకురాలు వేముల ఉమారాణి మరియు రాథోడ్ తదితరులు ఈ సందర్బంగా వివరించారు.
భక్తి పరవశత, ఆద్యాత్మిక అనుభూతిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవించాలని, కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి వచ్చి శ్రీవెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో మనసుకు శాంతిని, జీవితానికి సానుకూల శక్తిని పొందాలని వేముల ఉమారాణి జగిత్యాల ప్రాంత ప్రజలను కోరారు.
ఓం నమో వెంకటేశాయ
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.



