# Tags
#జగిత్యాల

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘంతో కలిసి ఆర్థికసాయం అందజేసిన జడ్పీ మాజీ చైర్ పర్సన్

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘం సభ్యులతో కలిసి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్

జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ 6వ వార్డ్ కు చెందిన పడాల రాజేష్ మరణించగా వారి భార్య పడాల నితిష మరియు ఇద్దరి పిల్లలకు జిల్లా మరియు సంఘం వారితో కలిసి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ఆర్థిక సాయం అందజేశారు.

ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు సంఘం ఆధ్వర్యంలో మరిన్ని చేపట్టాలని అన్నారు…

ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ,కోలగాని మధుసూదన్, శీలం ప్రవీణ్,దావ సురేష్,చీటీ లక్ష్మీనారాయణ,తీగల సూర్యప్రసాద్,నీలి ప్రతాప్,ములాసపు రాజన్న, అత్తినేని శ్రీనివాస్,పడాల తిరుపతి,కూరగాయల వెంకటి, కొలగాని అంజన్న,గుగ్గిలపు వేంకటి,దండే భూమేష్,దండే రమేష్,దండే వెంకటీ మరియు మున్నురుకాపు కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు…