మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన
జగిత్యాల :
పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన
జగిత్యాల పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపిక మరియు ప్రకటన నిమిత్తం నిర్వహింప తలపెట్టిన వార్డు సమవేశాలు ముందస్తుగా ఆయా వార్డు ప్రజానికానికి ఏవిధమైన సమాచారం లేకుండ ఏక పక్షంగా నిర్వహించుటతో ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తి వల్ల తిరిగి గ్రామ సభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు గురువారం ఒక లేఖ రాస్తూ, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇందిరా భవన్ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లారు. ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ స్పందన తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తూ, బైఠాయించారు.
మునిసిపల్ కమిషనర్ మరియు అధికార వార్డు అఫీసర్ లు పట్టణంలో గాని సంబందిత వార్డులలో గాని ముందస్తుగా ఏ విధమైన సమాచారం లేకుండ ఏకపక్షంగా వార్డ్ సభలు నిర్వహింపచేయటం మరియు గృహనిర్మాణ లబ్దిమంజూరి అవకాశముఉన్నవారికి ఎవరికి కూడ ఇతరత్రా నిరుపేద వర్గాలవారికి ఎవరికి కూడ సమాచారం పొందే అవకాశంలేకుండ వార్డు సమావేశాలు నిర్వహింప తలపెట్టడం జగిత్యాల మున్సిపల్ కమీషనర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





