# Tags
#తెలంగాణ

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సోమవారం బొమ్మకల్ రోడ్ లోని సిద్ధార్థ హై స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరము నిర్వహించారు.

దాదాపు 200 మంది విద్యార్థులకు మరియు సిబ్బందికి దంత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు మరియు వారికి టూత్ పేస్టులు మౌత్ వాష్ లు అందించారు .ఈ శిబిరంలో శరణ్య దంత వైద్యశాల డాక్టర్లు డాక్టర్ సౌమ్య మరియు డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ జంద్యం మాధవి, వైస్ గవర్నర్ అరుణ, సెక్రెటరీ మధుకర్ మరియు ఐపిసి చందా రవీందర్ ,వనితా క్లబ్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్వరూప, ఉమా, గంజి సుజాత, స్రవంతి, అవోపా సలహాదారులు గంజి స్వరాజ్ బాబు, సామ నారాయణ పాల్గొన్నారు.

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం