# Tags
#తెలంగాణ

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు :జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజ)

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల పరిధిలోని లింగాన్నపేట(ఎర్రషేలక తండా)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన

• సుమారు 300 మందికి ఆరోగ్య పరీక్షలు.

• ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

సోమవారం రోజున గంభీరావుపేట్ మండలం లింగాన్నపేట(ఎర్రషేలక తండా)లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్వినీ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్యం సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులు అయిన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ ,అర్ధోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడాం జరిగిందని,ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది ప్రజా భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోరకు కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా గతంలో వీర్నపల్లి,రుద్రంగి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ ,ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

.