# Tags
#తెలంగాణ #Events

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా :

కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు.

కరీంనగర్ లో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు….ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు VNR క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించామని వెల్లడించారు.

డిసెంబర్ 04 నుండి 30 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులను నిర్వహించామని వివరించారు..

ఈ ఉచిత తరగతులకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరై ఉచిత క్లాసులను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

JAGTIAL NEWS 03-01-2025