# Tags
#హైదరాబాద్ #జగిత్యాల

జగిత్యాల ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్

ఐ&పిఆర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జగిత్యాల డిపిఆర్ఓ భీమ్ కుమార్

-ఇన్‌ఛార్జ్‌ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్

జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జగిత్యాలలో OD ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ N. భీమ్ కుమార్ ను వెంటనే కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఐ & పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా,  కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో  పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జి. లక్ష్మణ్ కుమార్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు DPRO జగిత్యాల అదనపు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాలని ఆదేశించారు.

DPRO జగిత్యాల కార్యాలయం మరియు జగిత్యాల అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కార్యాలయం బిల్లులపై సంతకం చేయడానికి కూడా ఆయనకు అధికారం కల్పిస్తున్నట్టు ప్రత్యేక కమిషనర్ ఎం. హనుమంత రావు తన ఉత్తర్వులో పేర్కొన్నారు.