# Tags
#జగిత్యాల

క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి : ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు

జగిత్యాల :

విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించుకోవాలని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు అన్నారు.

శనివారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మొబైల్, ప్రేమ వ్యవహారాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నవారు ఏకాగ్రతను కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, వృద్ధిలోకి రావాలని సూచించారు.

పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన సమ మహీన్, షరీఫ్ ఉన్నిసా, వర్ష లను ఈ సందర్భంగా నోడల్ అధికారి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన నృత్యాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆలియా మక్సుద్, ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం, అధ్యాపకులు తిరుపతి, రిజ్వానా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.