#తెలంగాణ

ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంది : మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట :

మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

తహసిల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలానికి 1 కోటి 41 లక్షల రూపాయల చెక్కులను అందజేసి మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని అన్నారు.

రైతులకు రుణమాఫీ తో పాటు సన్నవడ్లకు 500 రూ. బోనస్ ను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా జనవరి 26 నుండి రైతు భరోసాను సంవత్సరానికి 12,000 ఇస్తూ…ఇందిరమ్మ భరోసా క్రింద భూమిలేని నిరుపేద కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాట రామ్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, పిఎస్ఎస్ సి చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, తిమ్మాపూర్ పిఎస్ఎస్సి వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, నాయకులు ఎస్కే సాహెబ్, షేక్ గౌస్ మరియు శ్రీనివాసరెడ్డి, గంట బుచ్చగౌడ్, చెన్ని బాబు బండారి బాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల వారీగా ఎల్లారెడ్డిపేట 13. వెంకటాపూర్ 12 రాచర్ల తిమ్మాపూర్ 15 సింగారం 2 రాజన్నపేట 7 పోతిరెడ్డిపల్లి 2 పధిర 6 నారాయణపూర్ 13 కోరుట్ల పేట 5 రాచర్ల గుండారం 6 రాచర్ల గొల్లపల్లి 20 దుమాల 5 రాచర్ల బొప్పాపూర్ 16 బండలింగంపల్లి 8. అల్మాస్పూర్ 9 అక్కపల్లి 2 చెక్కులను పంపిణీ చేయనున్నారని అన్నారు మండలంలో 141 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందించామని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *