# Tags
#తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి(తెలంగాణ రిపోర్టర్ )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో,వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు, రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.యారన్ డిపో ఏర్పాటు చేయాలని దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేస్తూ వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ 50 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వారి సంక్షేమం కోసం గల్ఫ్ కార్మికులు ఎదురుచూస్తున్న వాటిని నెరవేరుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో మంజూరు చేయడం పట్ల, గల్ఫ్ లో మరణించిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా విధి విధానాలు విడుదల చేయడం పట్ల గల్ఫ్ కార్మికులు పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి